- రవాణా వ్యవస్థ ద్వారా గ్రామాలకు కనెక్టివిటీ పెంచుతున్నాం
- బొంతుపల్లి గ్రామంలో బస్ సర్వీసును ప్రారంభించిన ప్రణవ్
- రైతులకు ఉపయోగపడే కల్వర్టు ప్రారంభం
- ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రణవ్, గ్రామస్తులు

Vodithala Pranav | వీణవంక, జులై 23 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించామని,మహిళల చుట్టే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. జమ్మికుంట నుండి గద్ధపాక వరకు నడిచే బస్ సర్వీసును ఆయన బొంతుపల్లి గ్రామంలో గురువారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ప్రణవ్ కు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళలతో కలిసి టికెట్ తీసుకొని బస్ లో ప్రయాణించారు. మహాలక్ష్మీ, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని మహిళలను అడగగా అందుతున్నాయని, చాలా సంతోషంగా ఉన్నామని వారు తెలిపారు.
అంతకుముందు బొంతుపల్లి గ్రామంలో రూ.8 లక్షల ఎస్డియఫ్ నిధులతో నిర్మించిన కల్వర్టును ప్రణవ్ ప్రారంభించారు. ఈ కల్వర్టు ద్వారా సుమారు 60 ఎకరాల పై చిలుకు రైతులకు ఇది ఉపయోగపడుతుందని, ఈ విషయంపై హుజురాబాద్ ఇంచార్జి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే మంజూరు చేపించిన ప్రణవ్ కు గ్రామస్థులు,రైతులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కోటి మంది మహిళలు కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని, ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలకు ప్రయోజనం చేకూరే పనులు చేస్తున్నామని, గ్రామాల్లో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని దీన్ని గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సర్వీసు మంజూరుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, నల్ల కొండల్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం వీణవంక మండల అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, సర్పంచులు బావు సంపత్, సరోజన మధుకర్ రెడ్డి, అందే శ్రీమతి కుమార్, జడల శ్రీకాంత్, మాజీ సర్పంచులు ఎల్లారెడ్డి, చిన్నాల ఐలయ్య యాదవ్, రాజ్‌కుమార్, మధుకర్, పర్లపల్లి రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీపతి రెడ్డి, మాదాసు సునీల్, సతీష్, రషీద్ పాషా, కాంగ్రెస్ పార్టీ నాయకులు వావినీల సత్యనారాయణ, కంకణాల జగదీశ్వర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, కోమల్ రెడ్డి, సంపత్, చదువు జితేందర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

